ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో వన్డేలో అతిథ్య టీమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీ లంక కెప్టెన్ శనక. తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఉన్నదని అతను టాస్ సందర్భంగా అన్నాడు. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. శ్రీలంక మాత్రం ఉడానా స్థానంలో రజితను టీమ్‌లోకి తీసుకుంది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన ధావన్ సేన.. ఈ మ్యాచ్ కూడా గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను గెలవాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ ఇద్దరు భారత స్పిన్నర్లకు రికార్డులు ఊరిస్తున్నాయి… చహల్ ఈ మ్యాచ్‌లో మరో ఆరు వికెట్లు తీస్తే గనుక వన్డే క్రికెట్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. అతి తక్కువ మ్యాచ్‌ల్లో 100 వికెట్ల ఫీట్ అందుకున్న ఆటగాడిగా చహల్ నిలువనున్నాడు. షమీ 56 మ్యాచ్‌ల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకోగా.. చహల్ కూడా ప్రస్తుతం 56వ మ్యాచ్ ఆడనున్నాడు.ఇదే మ్యాచ్‌లో హర్బజన్ రికార్డును కూడా చహల్ అందుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో చహల్ ఐదు వికెట్ల ఫీట్ అందుకుంటే హర్భజన్‌తో సమానంగా వన్డేల్లో మూడు సార్లు ఐదు వికెట్ల హాల్ అందుకున్న ఆటగాడిగా నిలవనున్నాడు. మరో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కూడా ఒక రికార్డు ఊరిస్తోంది. ఇప్పటివరకు వన్డేల్లో 107 వికెట్లు తీసిన కుల్దీప్.. మరొక వికెట్ తీస్తే బుమ్రా.. మూడు వికెట్లు తీస్తే యువరాజ్‌లతో సమానం కానున్నాడు.
ఇది కూడా చదవండి : షార్ట్ ఫిల్మ్స్ పేరుతో పోర్న్ చిత్రాల నిర్మాణం..