క్రికెట్లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ మరే మ్యాచ్ కు ఉండదు. ఈ రెండు దేశాలు ఆడుతుంటే మిగితా దేశాల ప్రేక్షకులు సైతం ఆసక్తితో మ్యాచ్ ను చూస్తారు. కాగా చాలా రోజుల తర్వాత ఈ రెండు దేశాలు టీ20 వరల్డ్ కప్ లో తలపడనున్నాయి. అయితే తాజా అప్డెట్ ప్రకారం అక్టోబర్ 24న ఈ మ్యాచ్ జరగనున్నట్లు ఐసీసీ వెల్లడించనట్లు ఏబీపీ న్యూస్ తన కథనంలో పేర్కొంది. గత నెలలోనే ఈ టీ20 వరల్డ్‌కప్ ఇండియాలో కాకుండా ఒమన్, యూఏఈల్లో జరగనుందని ఐసీసీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే టోర్నీని మాత్రం బీసీసీఐ నిర్వహిస్తోంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుంది.
దీంతో ఈ దాయాదుల పోరు ఖాయమని అప్పుడే తేలినా.. తాజాగా ఈ మ్యాచ్ తేదీ కూడా ఖరారైంది. మార్చి 20, 2021 నాటికి టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఐసీసీ జట్లను గ్రూపులుగా విభజించింది. ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ సూపర్ 12లో గ్రూప్ 2లో ఉన్నాయి. గ్రూప్ 1లో డిఫెండింగ్ చాంపియన్స్ వెస్టిండీస్‌తోపాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఉన్నాయి. ఇక గ్రూప్ 2లో ఇండియాతోపాటు పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ తలపడనున్నాయి. మరో నాలుగు టీమ్స్ క్వాలిఫయర్స్ నుంచి సూపర్ 12కు అర్హత సాధించనున్నాయి.
ఇది కూడా చదవండి: బిర్యానీలో బీర్ సీసా ముక్కలు.. హోటల్‌కు రూ.12వేలు జరిమానా