Friday, November 22, 2024

రేపటి నుంచి ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ టీ20 సిరీస్.. రాంచీ వేదికగా ఫస్ట్ మ్యాచ్‌

ఇటీవలె న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేల్లో 3-0తో భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసిన నేపథ్యంలో మరో మారు టీ 20 సమరంలో దూకనుంది. వన్డేల్లో విక్టరీ సాధించి జోష్‌లో ఉన్న భారత్‌ను ప్రతీకారంతో చిత్తు చేయాలని చూస్తోంది. టీ 20పై ఇరు జట్లు కన్నేసాయి. అజేయంగా నిలిచిన జట్టులో భారత్‌ గణనీయమైన మార్పులు చేసింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ కూడా తప్పుకున్నాడు. ఈ నెల ప్రారంభంలో శ్రీలంకతో జరిగిన టీ 20 జట్టుకు నాయకత్వం వహించిన హార్థిక్‌ పాండ్యా కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.
శార్థూల్‌ ఠాకూర్‌, మహమ్మద్‌ సిరాజ్‌, మహమ్మద్‌ షమీ వన్డేఇంటర్నేషనల్‌లలో అత్యుత్తమ పేసర్లు. అర్షదీప్‌

సింగ్‌, శివమ్‌ మావి, అన్‌ క్యాప్‌ ముఖేష్‌ కుమార్‌లకు చోటు కల్పించారు. ముంబై బ్యాటర్‌ పృథ్వీ షా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. షా బ్యాటింగ్‌ను శుభమన్‌ గిల్‌తో ప్రారంభించగలడు. మూడో ఓడీఐలలో వరుసగా 208, 112 స్కోర్‌లతో గిల్‌, పొట్టి ఫార్మట్‌లో తన దైన ముద్ర వేయడానికి సిద్దంగా ఉన్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌, ఒడిఐలలో నిరాశ పరిచాడు. అయితే అతను టీ 20 లలో నిజంగా రాణిస్తాడనేది న్యూజిలాండ్‌కు తెలుసు.

ఐసీసీ పురుషుల టీ 20 ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ తన అసాధరణమైన, నిర్భయమైన షాట్‌ల శ్రేణితో బార్‌ను అత్యధికంగా సెట్‌ చేశాడు. మూడు వన్డేల్లో కేవలం 30 పరుగులు మాత్రమే చేసిన ఇషాన్‌ కిషన్‌ తన సత్తా చాటాలి. న్యూజిలాండ్‌ ఆల్‌ రౌండర్‌ మిచెల్‌ సాంటర్న్‌ నాయకత్వం వహించనున్నాడు. సూపర్‌ స్మాష్‌లో అద్భుత ప్రదర్శన చేసిన లెప్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ బెన్‌ లిస్టర్‌ తన తొలి అంతర్జాతీయ క్యాప్‌ను సాధించే క్రమంలో ఉన్నాడు.

ఏ మ్యాచ్‌ ఎప్పుడు?

- Advertisement -

తొలి టీ 20: జనవరి 27న రాంచీ రాత్రి ఏడుగంటల నుంచి
రెండో టీ 20: జనవరి 29న లక్నో రాత్రి ఏడుగంటల నుంచి
మూడో టీ 20: ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌ రాత్రి ఏడు గంటల నుంచి

గత రికార్డు

భారత్‌ , న్యూజిలాండ్‌ మధ్య ఇప్పటి వరకు 22 మ్యాచ్‌లు జరిగితే 12 మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించగా కివీస్‌ 9 మ్యాచుల్లో గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement