Sunday, November 3, 2024

India vs New Zealand – కష్టాల్లో టీమ్ ఇండియా

ముంబయి – మూడో టెస్టులో విజయం సాధించేందుకు భారత్‌కు చక్కటి అవకాశం దక్కింది. ప్రత్యర్థి కివీస్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవ లేదు. ఆది లోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాలలో పడింది.

జడేజా తొలి ఇన్నింగ్స్‌తోపాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో భారత్‌ విజయలక్ష్యం ఎంతో తేలిపోయింది. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమ్‌ఇండియా ఎదుట 147 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.భారత్‌కు 28 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే.

ఓవర్‌నైట్ 171/9 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్‌ మరో మూడు రన్స్‌ను మాత్రమే జోడించింది. రవీంద్ర జడేజా (5/55) బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన అజాజ్ పటేల్ (8) బౌండరీ లైన్‌ వద్ద ఆకాశ్‌ దీప్‌ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. దీంతో జడేజా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 235 పరుగులు చేయగా.. భారత్‌ 263 పరుగులకు ఆలౌటైంది.

ఇక147 పరుగుల లక్ష్యం తో బరి లోకి దిగిన భారత్ రోహిత్, గిల్, కోహ్లీ వికెట్లు కోల్పోయింది. రోహిత్ 11 పరుగులు చేయగా, గిల్, కోహ్లీ ఒక్కో పరుగు చేసి పెవిలియన్ కు చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement