Saturday, November 23, 2024

తొలి రోజు టీమిండియాదే..

ఇంగ్లండ్ తో తొలి టెస్టులో టీమిండియా ఘనంగా గా ఆరంభించింది. తొలిరోజు పేసర్లు అద్భుతంగా రాణించడంతో ఇంగ్లాండు మొదటి ఇన్నింగ్స్ లో 105 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నాటింగ్ హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే, భారత పేస్ చతుష్టయం బుమ్రా (4/46), షమీ (3/28), శార్దూల్ ఠాకూర్ (2/41), సిరాజ్ (1/48) నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో తొలి రోజు కూడా పూర్తి కాకముందే ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 183 పరుగులకే ఆలౌట్ అయింది.

ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ జో రూట్ చేసిన 64 పరుగులే అత్యధికం. జానీ బెయిర్ స్టో 29, శామ్ కరన్ 27 నాటౌట్, జాక్ క్రాలే 27 పరుగులు చేశారు. ఓపెనర్ రోరీ బర్న్స్, డాన్ లారెన్స్, జోస్ బట్లర్ పరుగులేమీ సాధించకుండానే వెనుదిరిగారు.కాగా, ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ ను శార్దూల్ ఠాకూర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న వైనం తొలి రోజు ఆటలో హైలైట్ గా నిలుస్తుంది. బంతి లెగ్ సైడ్ వెళుతుందని భావించిన రూట్ వికెట్లకు ఎదురుగా నిలిచి ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి సర్రున స్వింగ్ అవుతూ రూట్ ప్యాడ్లను తాకడం, ఠాకూర్ అప్పీల్ చేయడం, అవుట్ అంటూ అంపైర్ వేలెత్తడం చకచకా జరిగిపోయాయి.

ఇంగ్లండ్‌ ఆరంభంలో కొంత తడబడినా…ఒక దశలో 138/3 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. రూట్, బెయిర్‌స్టో నాలుగో వికెట్‌కు 72 పరుగులు జోడించి జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే బెయిర్‌స్టోను షమీ అవుట్‌ చేయడంతో మొదలైన ఇంగ్లండ్‌ పతనం వేగంగా సాగింది. 45 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 7 వికెట్లు కోల్పోవడం విశేషం. 

అనంతరం భారత్‌ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (9 నాటౌట్‌), కేఎల్‌ రాహుల్‌ (9 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు.

ఇది కూడా చదవండి: ఆంధ్రాలోనే అకాడమీ.. సింధు క్లారిటీ

Advertisement

తాజా వార్తలు

Advertisement