Saturday, November 23, 2024

ప్చ్..తొలి టెస్టుకు చివరి రోజు వరుణుడు అడ్డంకి..

నాటింగ్ హామ్ టెస్టులో టీమిండియా విజయానికి వరుణుడు అడ్డుపడ్డాడు. ఆటకు నేడు ఐదో రోజు కాగా, వర్షంతో ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం చిత్తడిగా మారింది. దాంతో ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ టెస్టులో ఇంగ్లండ్ జట్టు భారత్ కు 209 పరుగుల లక్ష్యం నిర్దేశించగా, నాలుగో రోజు ఆట చివరికి భారత్ 1 వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఇంకా 157 పరుగులు చేస్తే విజయం టీమిండియానే వరిస్తుంది. అయితే, పిచ్ స్వింగ్ కు విశేషంగా సహకరిస్తున్న..దాంతో పాటు వర్షం కూడ పడటంతో ఆటకు చివరిరోజున భారత బ్యాట్స్ మెన్ కు సవాల్ తప్పదనిపిస్తోంది. ఈ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేయగా, భారత్ 278 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ రూట్ సెంచరీ సాయంతో 303 పరుగులు నమోదు చేసింది.

ఇది కూడా చదవండి: ఏపీలో జడ్జిల పై పోస్టులు పెట్టిన ఐదుగురు అరెస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement