ఇంగ్లాండుతో రెండో టెస్ట్ లో టీమిండియా తొలి రోజు ఆదిపత్యం కనబర్చింది. కాని రెండో రోజు ఆది లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభమైన తొలి ఓవర్ లో రాహుల్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత అజింక్యా రహానే కూడా ఔటయ్యాడు. దీంతో టీమిండియా భారీ స్కోరుకు కన్నం పడింది. మొదట 129 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ఓలి రాబిన్‌సన్ వేసిన ఇన్నింగ్స్ 91 ఓవర్ రెండో బంతికి సిబ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత జేమ్స్ అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 92వ ఓవర్ తొలి బంతికే 1 పరుగు చేసిన రహానే రూట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 5 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 17, జడేజా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
ఇది కూడా చదవండి: వీడియో: బాయ్‌ఫ్రెండ్ కోసం కొట్టుకున్న ఇద్దరు యువతులు