రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అవుట్ అయిన కాసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పెవిలియన్ చేరాడు. 4 ఫోర్లు కొట్టి మంచి ఊపు మీద కనిపించిన విరాట్ కోహ్లీ శ్యామ్ కర్రను బౌలింగ్లో వికెట్ కీపర్ బట్లర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇంకా అంతకుముందు రాహుల్‌ను వెనక్కి పంపిన మార్క్‌వుడ్‌కే రోహిత్ కూడా దొరికిపోయాడు. 2 ఫోర్లు, సిక్సర్ బాది ఊపుమీద ఉన్నట్టు కనిపించిన రోహిత్ 21 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఇక జట్టు స్కోరు 18 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ రూపంలో తొలి వికెట్ చేజార్జుకుంది. 30 బంతులు ఎదుర్కొని 5 పరుగులు మాత్రమే చేసిన రాహుల్ మార్క్‌వుడ్ బౌలింగులో వికెట్ల వెనక దొరికిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీతో అదరగొట్టిన రాహుల్ ఆదిలోనే అవుట్ కావడం అభిమానులను నిరాశపరిచింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 56/3 పుజారా, రహానే క్రీజులో ఉన్నారు. 29 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది.
ఇది కూడా చదవండి: వీడియో: లార్డ్స్ లో జెండా ఎగురవేసిన కెప్టెన్ కోహ్లీ..