. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది . తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ టీమ్.. మన బౌలర్ల దెబ్బకు 20 ఓవర్లలో 132 పరుగులకే పరిమితమైంది. ఇక 133 పరుగుల లక్ష్యాన్ని 13 ఓవర్ లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది.
భారత్ కు అభిషేక్ శర్మ, సంజు శుభారంభం చేశారు. తొలి వికెట్ కు 41 పరుగులు జోడించారు. 26 పరుగులు చేసిన సంజు ఔట్ కాగా, సూర్య కుమార్ యాదవ్ సున్నా పరుగులకు వెనుదిరిగాడు.ఇక అభిషేక్ 79 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 19, హార్దిక్ 3 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు
ఇక భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌కు మొదటి టీ20లోనే చుక్కలు కనిపిస్తున్నాయి. టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో బట్లర్ సేనను వణికించారు. 132 పరుగులకు కట్టడి చేశారు అర్ష్‌దీప్ సింగ్ (2/17), హార్దిక్ పాండ్యా (2/42), అక్షర్ పటేల్ (2/22) అదరగొట్టారు. వరుణ్ చక్రవర్తి (3/23) ఇంగ్లండ్ వెన్ను విరిచాడు