ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఇవాళ కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్ జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇంగ్లండ్ తొలి ఓవర్ లోనే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్ లో సాల్ట్ సున్నా పరుగులకు ఔట్ అయ్యాడు. ఇక నాలుగు పరుగులు చేసిన బెన్ డక్ట్ కూడా అర్షదీప్ కు చిక్కాడు.
ఇక వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు.. హెన్రీ బ్రూక్ 17 పరుగులు చేసి ఔట్ కాగా, లివింగ్ స్టోన్ డకౌట్ అయ్యాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ 10 ఓవర్లలో 75 పరుగులు చేసింది.
తుది జట్లు ఇవే..భారత్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ : బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, జామీ ఓవర్టన్, గూస్ అట్కిన్‌సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్