చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ విలవిలలాడింది. తొలి ఇన్నింగ్స్ లో 149 పరుగులకే కుప్పకూలింది. నిప్పులు చెరిగే బంతులు విసిరిన భారత బౌలర్ల ముందు బంగ్లా బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. మొదట్లో 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడ్డ ఆ జట్టును షకిబుల్ హాసన్ (32), లిట్టన్ దాస్ (22) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ద్వయం 51 పరుగుల భాగస్వామ్యం అందించింది. అ తర్వాత ఈ ఇద్దరూ కూడా పెవిలియన్ చేరారు.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా,, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, సిరాజ్ లు తలో రెండు వికెట్ల పడగొట్టారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
రెండో రోజు ఉదయం సెషన్‌లో ఇండియా నాలుగు వికెట్లను కోల్పోయింది. బంగ్లా బౌలర్ తస్కిన్ రెండో రోజు మూడు వికెట్లను తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ తొలి న్నింగ్స్‌లో స్పీడ్‌స్టర్ హసన్ అహ్మద్ తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు. రెండో రోజు బుమ్రా వికెట్‌ను తీశాడతను. తస్కిన్, హసన్‌లు తమ ఖాతాలో 8 వికెట్లు వేసుకున్నారు.
తొలి రోజు ఆరు వికెట్లకు 339 రన్స్ చేసిన ఇండియా రెండో రోజు కేవలం 37 పరుగులు మాత్రమే జోడించి చివరి 4 వికెట్లను చేజార్చుకున్నది. సెంచరీకి చేరువు అవుతున్న జడేజా తొలుత అవుటయ్యాడు. అతను 86 రన్స్ చేసి నిష్క్రమించాడు. ఆ తర్వాత ఆకాశ్ దీప్ 17 రన్స్ చేసి క్యాచ్ అవుటయ్యాడు. చివరకు అశ్విన్ కూడా తస్కిన్ బౌలింగ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు వెళ్లాడు. అశ్విన్ 113 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి.