చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ విలవిలలాడుతోంది. 112 పరుగులకే కీలకమైన ఎనిమిది వికెట్లు కోల్పోయింది. నిప్పులు చెరిగే బంతులు విసిరిన భారత బౌలర్ల ముందు బంగ్లా బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. మొదట్లో 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడ్డ ఆ జట్టును షకిబుల్ హాసన్ (32), లిట్టన్ దాస్ (22) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ద్వయం 51 పరుగుల భాగస్వామ్యం అందించింది.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా,, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్ల పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ టీ విరామ సమయానికి 8 వికెట్లకు 112 పరుగులు చేసింది. క్రీజులో హసన్ ముహమూద్ (12) ఉన్నారు. ఇంకా టీమిండియా కంటే బంగ్లా 264 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.