చెన్నై టెస్ట్ లో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఒకవైపు టాప్ ఆర్డర్ బ్యాటర్లు నిష్క్రమిస్తున్నా.. అతను మాత్రం క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో.. జైస్వాల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 98 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో జైస్వాల్ అర్థ సెంచరీ పూర్తి చేశాడు.
భోజన విరామ సమయం తర్వాత జైస్వాల్ తన ఖాతాలో హాఫ్ సెంచరీ వేసుకున్నాడు. టెస్టుల్లో అతినికి ఇది 5వ హాఫ్ సెంచరీ. లంచ్‌కు ముందు 3 వికెట్లు కోల్పోయి 88 రన్స్ చేసిన భారత్ ఆ తర్వాత కీలకమైన పంత్ వికెట్‌ను కోల్పోయింది. పంత్ 39 రన్స్ స్కోర్ చేసి ఔటయ్యాడు. బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇండియా 6 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది. జైస్వాల్ 56, రాహుల్ 16 పరుగులు చేసి అవుటయ్యారు. అశ్విన్ 16పరుగులు, జడేజా 7 పరుగుతోనూ క్రీజ్‌లో ఉన్నారు.