Friday, November 22, 2024

2025 నాటికి మిగ్‌-21 ఫైట‌ర్ ప్లేన్ ల‌ను ఉపసంహరించ‌నున్న భార‌త్..

మిగ్‌ విమానాలు కూలిపోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్న కారణంగా 2025 నాటికి ఈ యుద్ధ విమానాలను ఉపసంహరించాలని వాయుసేన నిర్ణయించింది. ఇటీవల రాజస్థాన్‌లోని బార్మార్‌ జిల్లాలో జరిగిని మిగ్‌ విమాన ప్రమాదం సంఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. ఈ ప్రమాదంలో మరణించిన పైలట్లు ఇద్దరూ శిక్షణ పొందుతన్న వారే.

రౌండ్స్ కొడుతున్న సమయంలో ఈ ఫైట‌ర్ జెట్ కూలిపోయింది. 1960వ దశకం నుంచి సోవియట్‌ యూనియన్‌కి చెందిన ఈ విమానాలను మన దేశం దిగుమతి చేసుకుంటోంది. అప్పటికన్నా ఎన్నో అధునాతన రీతుల్లో ఉన్న విమానలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న దృష్ట్యా, దశలవారీగా మిగ్‌ విమానాలను ఉపసంహరిం చాలని నిర్ణయించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement