Saturday, November 23, 2024

భారత్‌ వేదికగా ఐఓసీ సమావేశం

హైదరాబాద్‌: అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) 2023 సమావేశం వచ్చే ఏడాది భారత్‌లో జరగనుంది. ఈ మేరకు భారత్‌ హక్కులు దక్కించుకుంది. 40ఏళ్ల తర్వాత మరోసారి భారత్‌కు ఈ అవకాశం దక్కింది. 1983లో చివరిసారి ఢిల్లిలో ఐఓసీ సమావేశం జరిగింది. వచ్చే ఏడాదిలో ఐఓసీ సమావేశం జరగనుండగా ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఐఓసీ సమావేశానికి భారత్‌కు అవకాశం రావడంపై జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది వేసవికాలంలో ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ (జీడబ్ల్యూసీ) సెంటర్‌లో సమావేశం జరగనుందని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో 150మందికిపైగా ఐఓసీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించారు. ఐఓసీ నూతన కార్యవర్గం, సభ్యుల ఎంపిక, ఒలింపిక్స్‌ ఆతిథ్య దేశ ఎంపికపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని జగన్‌మోహన్‌రావు తెలిపారు. కాగా బీజింగ్‌లో జరుగుతున్న 139వ ఐఓసీ సెషన్‌లో భారతబృందం అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ సభ్యులను ఒప్పించింది. ఈ సమావేశంలో భారత్‌ తరఫున ఒలింపిక్స్‌ పసిడి పతక విజేత అభినవ్‌బింద్రా, ఐఓసీ సభ్యురాలు నీతా అంబానీ, భారత ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా, కేంద్ర క్రీడామంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement