Tuesday, November 26, 2024

సిరీస్‌పై భారత్‌ గురి.. నేడు గువ‌హ‌టీ స్టేడియంలో సఫారీలతో రెండో టీ20

సఫారీలతో తొలి టి20లో శుభారంభం చేసిన టీమిండియా.. ఇప్పుడు రెండో టీ 20 ఆడేందుకు రెడీ అయ్యింది. తొలి టి 20లో ఘన విజయం సాధించిన టీమిండియా గువహటి వేదికగా రెండో టీ 20 ఆదివారం (అక్టోబర్‌ 2)న ఆడనుంది. శుక్రవారం సఫారీ, టీమిండియా జట్లు అస్సాంలోని గువహటిలో అడుగుపెట్టాయి. అక్టోబర్‌ రెండో తేదీన మ్యాచ్‌ జరుగనుంది. తొలి టీ 20 జరిగిన తిరువనంతపు రం నుంచి నేరుగా గువహటి కి ఇరుజట్ల ఆటగాళ్లు చేరుకున్నారు. గువహటి ఎయిర్‌ పోర్టు నుంచి బయటకు వస్తున్న భారత ఆటగాళ్ల ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పర్యాటక జట్టు అయిన దక్షిణా ఫ్రికా టీమిండియాతో తిరువనంతపురం వేదికగా ఆడిన మ్యాచ్‌లో పరాజయపాలైంది. ఆధిక్యంలో ఉన్న టీమిండియాపై దక్షిణాఫ్రికా ఫైనల్‌ సిరీస్‌కు వెళ్లే అవకాశం ఉంది.

అర్షదీప్‌ బౌలింగ్‌

తొలి టీ 20లో భారత జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ అర్షదీప్‌ సింగ్‌ చాలా సందర్బాల్లో మంచి ప్రదర్శన చేశాడు. దక్షిణాఫ్రికాపై ప్రమాదకరంగా బౌలింగ్‌ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో పవర్‌ ప్లేలో మూడు వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో టీ 20 ఇంటర్‌ నేషనల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు.

సిరాజ్‌కు టీమిండియాలో చోటు

- Advertisement -

హైదరాబాద్‌ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు అదృష్టం వరించింది. . ఇప్పటివరకు వన్‌డే టెస్టుల్లో ఆడిన అతను ప్రస్తుతం జరుగుతున్న టీ 20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. స్టార్‌ పేసర్‌ బుమ్రా వెన్ను నొప్పితో ఈ సిరీస్‌ నుంచి వైదొలిగాడు. దీంతో అతని ప్లేస్‌లో సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. బుమ్రా స్థానంలో సిరాజ్‌ ఆడనున్నట్లు వెల్లడించింది. వరల్డ్‌ కప్‌లో ఆడాలని తన చిరకాల స్వప్నానికి కేవలం అడుగు దూరంలో నిలిచాడు. హైదరాబాద్‌ గల్లిdలలో ఆడుకునే సిరాజ్‌ ప్రపంచకప్‌ కోసం ఆడే క్రికెటర్ల జాబితాలో చేరుతున్నాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా గడ్డపైనే సిరాజ్‌ అంతర్జాతీయ టెస్ట్‌లోకి అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్ల తో సత్తాచాటాడు. ఒకవేళ సిరాజ్‌ ఆస్ట్రేలియా విమా నం ఎక్కితే అది నిజంగా చరిత్రే. తెలుగు రాష్ట్రాల నుం చి ప్రపంచకప్‌ ఆడిన క్రికెటర్‌గా సిరాజ్‌ చరిత్రకెక్క నున్నాడు. దిగ్గజ క్రికెటర్‌లు వీవిఎస్‌ లక్ష్మణ్‌, అంబటి రాయుడు ఈ ఘనతను అందుకోలేకపోయారు.

రన్‌మెషీన్‌లా సూర్యకుమార్‌

ఇండియా బెస్ట్‌ టీ 20 బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఖ్యాతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జట్టులోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ రన్‌మెషీన్‌లా దూసుకెళు ్తన్నాడు. ప్రతీ సిరీస్‌లో విజయాలను అందిస్తున్నాడు. తను ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో ఇండియా తరపున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఈ ఏడాదిలో సూర్య ఇప్పటికే 732 రన్స్‌ చేశాడు. దాంతో 2018లో 689 రన్స్‌ తో టాప్‌ లో ఉన్న శిఖర్‌ ధవన్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఆస్ట్రేలియాతో మూడో టీ 20లో , సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో ఫిప్టీ కొట్టిన సూర్య తన టి 20 కెరీర్‌లో 1000పరుగుల మైలురాయి దాటేందుకు మరో 24 రన్స్‌ మాత్రమే దూరంలో ఉన్నాడు. తిరువనంతపు రం వేదికగా భారత్‌ – దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ తర్వాత రెండో టీ 20 గువహటిలో జరుగనుండగా మూడో టీ 20 ఇండోర్‌లో జరగనుంది.

ఇండియా జట్టు : రోహిత్‌ శర్మ, కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకు మార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తిక్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విని, అర్షదీప్‌, హర్షల్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌

దక్షిణాఫ్రికా జట్టు : క్విన్‌టాన్‌ దె కాక్‌, టెంబ బవుమ, రోసో, అయిదెన్‌ మార్కారం, డేవిడ్‌ మిల్లర్‌, ట్రిస్టియన్‌ స్టబ్స్‌, వేనేపార్నె ల్‌, కేశవ్‌ మహరాజ్‌, కగిసో రబడ, శంసి, అన్‌రిచ్‌ నోర్తేజ్‌

తేదీ అండ్‌ సమయం: ఆదివారం , అక్టోబర్‌ 2 రాత్రి ఏడుగంటలనుంచి11 వరకు
వేదిక: గువ‌హ‌టి

Advertisement

తాజా వార్తలు

Advertisement