Friday, October 4, 2024

INDw vs SAw | ఆగ‌ని వ‌ర్షం.. భార‌త్ – దక్షిణాఫ్రికా రెండో టీ20 ర‌ద్దు..

టీ20 సిరీస్ ను సమం చేయాలని భావించిన భారత మహిళల జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చ‌ల్లాడు. నేడు (ఆదివారం) చెన్నైలోని చెపాక్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మొదలైన వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో అంపైర్లు ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడి మ్యాచ్‌ను రద్దు చేశారు. ప్రస్తుతం ఈ పొట్టి సిరీస్‌లో ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు 1-0తో ఆధిక్యంలో ఉంది.

ఇదిలా ఉంటే జూలై 9న మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. కాగా, ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ డ్రాగా ముగుస్తుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా విజ‌యం సాధిస్తే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement