Tuesday, November 26, 2024

Japan Open | సత్తా చాటుతున్న భారత్.. క్వార్టర్స్‌లోకి ప్రణయ్, లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్

జ‌పాన్ లోని టోక్యోలో జ‌రుగుతున్న జపాన్ ఓపెన్ 2023లో భారత్ షట్ల‌ర్లు త‌మ స‌త్తా చాటుతున్నారు. ఇవ్వాల (గురువారం) జరిగిన జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ లో తన తోటి జాతీయ ఆటగాడు శ్రీకాంత్ కిదాంబిపై 19-21, 21-9, 21-9 తేడాతో విజయం సాధించి.. రేపు జ‌ర‌గ‌నున్న క్వాట‌ర్ ఫైన‌ల్స్ కి చేరుకున్నాడు హెచ్‌ఎస్ ప్రణయ్.

అలాగే నిన్న (బుద‌వారం) తన తోటి జాతీయ ఆటగాడు ప్రియాంషు రజావత్ తో పోటీ ప‌డిన‌ లక్ష్య సేన్.. ఇవ్వాల జ‌రిగిన‌ రౌండ్ ఆఫ్ 16 ప్రీ-క్వార్టర్స్ లో 21-14, 21-16తో జపనీస్ షట్లర్ కాంటా సునేయామాపై వరుస సెట్లలో విజయం సాధించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.

ఇక‌, పురుషుల డబుల్స్ లో భార‌త్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి కూడా క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించారు. డానిష్ జోడీ లాస్సే మోల్హెడే, జెప్పీ బేపై 21-17, 21-11 వరుస సెట్లలో విజయం సాధించి.. చివరి-ఎనిమిది దశకు చేరుకున్నారు సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్.

అయితే, భారత మహిళల జోడి అయిన‌ గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ.. వారి రౌండ్-ఆఫ్-16 ఔటింగ్‌లో జ‌పాన్ కు చెందిన నమీ మత్సుయామా, చిరారు షిదాల‌తో పోటీ ప‌డ‌గా.. 21-23, 19-21 తేడాతో ఓటమి పాలైయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement