ఇంగ్లండ్‌తో రెండో వన్డేలోనూ టీమిండియా రఫ్పాడించింది. తొలుత ఆచితూచి ఆడిన భారత ఆటగాళ్లు తర్వాత జూలు విదిల్చారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 6 వికెట్లు నష్టపోయి 337 పరుగులు చేసింది. ఓపెనర్లు ధావన్ (4), రోహిత్ (25) తక్కువ స్కోర్లకే వెనుతిరిగారు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ (66), కేఎల్ రాహుల్ (108), రిషబ్ పంత్ (77) చెలరేగి ఆడారు. ముఖ్యంగా పంత్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అటు హార్డిక్ పాండ్యా (35) నాలుగు సిక్సర్లు కొట్టి స్కోరు వేగాన్ని పెంచాడు. దీంతో మరోసారి ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ నిలిచింది. తొలి వన్డేలోనూ భారత్ 317 పరుగులు చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement