ఢిల్లిలోని అరుణ్ జైట్లి స్టేడియం వేదికగా భారత్ – బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20లో భారత బ్యాటర్లు దంచి కొట్టారు. సీరీసే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా చెలరేగిపోయింది. సిక్సులు, ఫోర్లతో బౌండరీల మోత మోగించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్… నిర్ణీత ఓవర్లలో 221/9 పరుగులు సాధించింది.
అదిలోనే టీమిండియా కీలక వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన నితిశ్ కుమార్ రెడ్డి (34 బంతుత్లో 4ఫోర్లు, 7సిక్సులు *74), రింకూ సింగ్ (26 బంతుత్లో 5ఫోర్లు, 3సిక్సులు *53) తో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు *32), రియాన్ పరాగా (6 బంతుల్లో 2 సిక్సర్లు *15) అద్భుత ప్రదర్శన చేశారు.
బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సేన్ మూడు వికెట్లు తీయగా.. తస్కిన్ అహ్మద్, తాంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రెహమాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం 222 పరుగుల భారీ లక్ష్యంతో బంగ్లాదేశ్ జట్టు బరిలోకి దిగింది.