Saturday, November 23, 2024

పాలస్తీనాకు ఔషధాలు పంపించిన భారత్‌.. 38.9 టన్నుల సహాయక సామాగ్రితో విమానం

యుద్ధంతో అల్లాడిపోతున్న పాలస్తీనాకు మానవీయ సాయాన్ని భారత్‌ పంపించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ఆదివారం తెలిపారు. ”పాలస్తీనా ప్రజలకు భారత్‌ మానవీయ సాయాన్ని పంపించింది. దాదాపు 6.5 టన్నుల వైద్య సాయం, 32 టన్నుల విపత్తు ఉపశమన సామాగ్రితో భారత వైమానిక దళానికి చెందిన ఐఏఎఫ్‌ సీ-17 విమానం ఈజిప్టులో ఎల్‌-అరిష్‌ విమానాశ్రయానికి బయలుదేరింది” అని తెలిపారు. సహాయక సామాగ్రిలో అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడే ఔషధాలు, శస్త్రచికిత్స సామాగ్రి, టెంట్లు, స్లీపింగ్‌ బ్యాగ్‌లు, టార్పాలిన్లు, శానిటరీ వస్తువులు, నీటిని శుద్ధి చేసే ట్యాబెట్లు, ఇతర నిత్యావసరాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement