Friday, November 22, 2024

దేశంలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 1.52 లక్షల కరోనా కేసులు

దేశంలో క‌రోనా​ విలయ తాండవం కొనసాగుతోంది. రోజువారి కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతూనే ఉన్నాయి. శనివారం ఒక్కరోజే 1,52,879 మంది కరోనా​ బారిన పడినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్​ ధాటికి మరో 839 మంది బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,69,275కి చేరింది. శనివారం కరోనా నుంచి 90,584 మంది కోలుకున్నారు. తాజా కేసులతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,33,58,805కు చేరింది.

అటు దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,20,81,443 మంది కోలుకున్నారు. 11,08,087 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 10,15,95,147 మందికి వ్యాక్సిన్లు వేశారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 90.44 శాతానికి చేరగా, మరణాల రేటు 1.27 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement