Saturday, November 23, 2024

బిలియనీర్ల జాబితాలో భారత్‌ది మూడో స్థానం.. 2021లో 215 మంది, కొత్తగా 58 మంది చేరిక

భారత్‌లో బిలియనీర్ల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతూ పోతున్నది. 2021లో దేశంలో 215 మంది బిలియనీర్లు ఉండగా.. కొత్తగా 58 మంది ఈ జాబితాలో చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు కలిగి ఉన్న దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. 2022 వివరాల ప్రకారం.. అమెరికా టాప్‌లో ఉండగా.. చైనా రెండో స్థానంలో కొనసాగుతున్నది. భారత్‌ సంతతికి చెందిన బిలియనీర్లు మొత్తం 249కు చేరుకుంది. అయితే నగరాల వారీగా చూసుకుంటే.. ముంబై టాప్‌లో ఉంది. ఒక ఆర్థిక రాజధాని నుంచే 72 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆ తరువాత స్థానంలో 51 మంది బిలియనీర్లతో ఢిల్లి రెండో స్థానంలో, బెంగళూరు 28 మందితో మూడో స్థానంలో నిలిచాయి. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 3381 మంది బిలియనీర్లు ఉండగా.. అందులో 153 మంది కొత్తగా వచ్చినవారే కావడం గమనార్హం.

భారీగా పెరిగిన బిలియనీర్ల సంపద..

గతేడాది భారత్‌ బిలియనీర్ల సంపద 700 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఈ పెరిగిన విలువ స్విట్జర్లాండ్‌ జీడీపీకి సమానం. యూఏఈ జీడీపీకి రెండు రెట్లు అధికం. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ ఆస్తి.. సగటున ప్రతీ వారం రూ.6000 కోట్లు చేరుతున్నది. 49 బిలియన్‌ డాలర్ల సంపదను ఆయన కలిగి ఉన్నారు. ముఖేష్‌ అంబానీ, తన ఆస్తులను 24 శాతం మేర పెంచుకుని.. 103 బిలియన్‌ డాలర్లతో టాప్‌లో ఉన్నారు. సైరన్‌ పూనావాలా 26 బిలియన్‌ డాలర్లు, కుమార మంగళం బిర్లా 18 బిలియన్‌ డాలర్లు, నస్లీ వాడియా 7.5 బిలియన్‌ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. ఇండిగో రాకేశ్‌ గంగ్వాల్‌ వద్ద 4.3 బి.డాలర్లు, రాహుల్‌ భాటియా వద్ద 4.2 బి.డాలర్ల ఆస్తి ఉంది. 16 బిలియన్‌ డాలర్లతో ఉదయ్‌ కోటక్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని శాసిస్తున్న శివనాడార్‌ 28 బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో మూడో బిలియనీర్‌గా నిలిచారు. తాజాగా నైకా వ్యవస్థాపకురాలు ఫాల్గునీ నాయర్‌.. బిలియనీర్‌ జాబితాలో చేరారు. ఓయో వ్యవస్థాపకుడు రితేష్‌ అగర్వాల్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ కిశోర్‌ బియానీలు కూడా ఈ జాబితాలో చోటు సంపాధించుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement