మైగ్రేషన్ కన్సల్టెన్సీ సంస్థ హెన్లీ & పార్ట్‌నర్స్ ఈ ఏడాది (2023) విడుదల చేసిన ర్యాంకింగ్‌లలో భారతదేశం 80వ స్థానానికి ఎగబాకింది. మైగ్రేషన్ కన్సల్టెన్సీ సంస్థ హెన్లీ & పార్ట్‌నర్స్ అనేది దేశాల పాస్‌పోర్ట్‌లపై ప్రయాణానికి అందుబాటులో ఉన్న వీసా-రహిత యాక్సెస్ ఆధారంగా దేశాలకు ర్యాంక్ ఇస్తుంది. పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రపంచంలోని పాస్‌పోర్ట్‌లను ప్రదర్శించడానికి, క్రమబద్ధీకరించడానికి, ర్యాంక్ చేయడానికి అత్యంత ప్రజాదరణ పొందిన ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ సాధనంగా మారింది.
ప్రస్తుతం, భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ముందస్తు వీసా లేకుండా 57 దేశాలకు చేరుకోవచ్చు. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2022లో దేశం ర్యాంకింగ్ 87వ స్థానంలో ఉండగా ఈ సంవత్సరానికి భారతీయ పాస్‌పోర్ట్ ఒక అడుగు ముందుకు వేసి బలపడింది.
కాగా, భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లు ప్రస్తుతం ఇండోనేషియా, థాయ్‌లాండ్, రువాండా, జమైకా, శ్రీలంక వంటి దేశాలకు వీసా లేకున్న ప్రయాణించవచ్చు. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరో 177 గమ్యస్థానాలకు వెల్లడానికి వీసా అవసరం ఉంటుంది. ఆ దేశాలలో కొన్ని చైనా, జపాన్, రష్యా, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ వంటివి ఉన్నాయి. సింగపూర్, జపాన్ దేశాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్నాయి. ఈ దేశాల పాస్ పోర్ట్ తో ఏకంగా 192 ప్రపంచ గమ్యస్థానాలకు వీసా-రహితంగా ప్రయాణించవచ్చు.