Tuesday, November 26, 2024

బంగారం రీసైక్లింగ్‌లో 4వ స్థానంలో భారత్‌.. 75 టన్నుల పాత బంగారం వాడుకలోకి

పాత బంగారాన్ని రిసైక్లింగ్‌ చేసి ఉపయోగిస్తున్న దేశాల్లో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. ఈ విషయంలో చైనా అగ్రస్థానంలో ఉంది. 2021లో మన దేశంలో 75 టన్నుల బంగారాన్ని ఇలా రిసైక్లింగ్‌ చేశారు. ఇది మొత్తం బంగారం వినియోగంలో 6.5 శాతం గా ఉంది. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసి) నివేదిక ప్రకారం గత ఐదు సంవత్సరాల్లో మన దేశంలో వినియోగించిన మొత్తం బంగారంలో 11 శాతం పాత బంగారమే ఉంది. ఇలా పాత బంగారం రిసైక్లింగ్‌ చేసి ఉపయోగించడం వల్ల దీని మార్కెట్‌ ధర, భవిష్యత్‌ ధరపైనా, ఆర్థిక ప్రయోజనాలపైనా పడుతుందని తెలిపింది. చైనాలో 2020లో 189, 2021లో 168 టన్నుల పాత బంగారాన్ని రిసైక్లింగ్‌ చేసింది. రెండో స్థానంలో ఉన్న ఇటలీలో 2020లో 87, 2021లో 80 టన్నుల బంగారాన్ని రిసైక్లింగ్‌ చేశారు. ఇక మూడో స్థానంలో ఉన్న అమెరికాలో 2020లో 72, 2021లో 78 టన్నుల బంగారాన్ని రిసైక్లింగ్‌ చేశారు. నాలుగో స్థానంలో ఉన్న మన దేశంలో 2020లో 96 టన్నులు, 2021లో 75 టన్నుల పాత బంగారాన్ని రిసైక్లింగ్‌ చేసి వినియోగించారు. మార్కెట్‌లో బంగారం రేట్లు పెరిగినప్పుడల్లా చాలా మంది తమ పాత బంగారాన్ని అమ్మడం చేస్తున్నారు. కొంత మంది ఇతర అవసరాలకు పాత బంగారాన్ని అమ్మివేస్తున్నారు.

మరి కొంత మంది కొత్త మోడల్స్‌ మార్కెట్‌లోకి రావడం వల్ల తమ వద్ద ఉన్న పాత బంగారు నగలను మార్చుకుని, కొత్త వాటిని కొనుగోలు చేస్తున్నారని డబ్ల్యూజీసీ తన నివేదికలో తెలిపింది. దేశీయ మార్కెట్‌లో బంగారినికి డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. దీనితో పాటే బంగారాన్ని రిఫైన్‌ చేసే సామర్ధ్యం కూడా పెరుగుతోంది. 2013లో మన దేశంలో 300 టన్నుల బంగారాన్ని శుద్ది చేస్తే, 2021 నాటికి 1800 టన్నులకు పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. దిగుమతి చేసుకునే ముడి బంగారానికి, మన దేశంలో శుద్ధి చేసిన బంగారం పై భారత ప్రభుత్వం విధిస్తున్న పన్నుల్లో తేడా ఉండటం వల్ల ఈ పెరుగుదుల నమోదైందని నివేదిలో తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఈ దిశగా మరిన్ని పన్నులు రాయితీలు ఇస్తే, దేశంలోనే రిఫైనింగ్‌ చేసే పరిశ్రమలు మరిన్ని పెరుగుతాయని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్ రీజనల్‌ సీఈవో సోమసుందరం అభిప్రాయపడ్డారు. ఇలా చేస్తే దేశంలో ముడి బంగారంతో పాటు, స్కాప్‌ సప్లయ్‌ కూడా పెరుగుతుందన్నారు. రిసైక్లింగ్‌ విధానానికి మరింత మద్దతు ఇవ్వడం ద్వారా ఈ మార్కెట్‌ మరింత బలోపేతం అవుందని అభిప్రాయడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement