అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్ షాట్‌గన్‌లో భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం జరిగిన ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ పోటీలో పతకాల ఆశ నెరవేరలేదు. దీంతో ఐఎస్‌ఎస్‌ఎఫ్‌లో భారత్ పోరు ఓటమితో ముగిసింది. ఇప్పటి వరకు ఒక రజతం, ఒక కాంస్యం నెగ్గిన భారత్ పతకాల పట్టికలో ఐదవ స్థానంతో సరిపెట్టుకుంది. ఆస్ట్రేలియా కూడా ఒక రజతం, ఒక కాంస్యంతో భారత్‌తో సమానంగా నిలిచింది.
చివరి పోటీలో భారత షూటర్లు పృథ్వీరాజ్ తొండైమాస్, శ్రేయాసి సింగ్ జంట 150 లక్ష్యాలకు గాను 136 ని చేరుకుంది. ఒక్క పాయింట్ తేడాతో కాంస్యాన్ని కోల్పోయింది. స్వదేశీ జోడీ మరియా డిమిత్రియెంకో, విక్టర్ ఖస్యానోవ్‌లు 142 స్కోరుతో స్వర్ణం సాధించగా, టర్కీకి రజతం, ఇరాన్‌కు కాంస్యం లభించాయి. మరొక భారత జోడి జోరావర్ సంధు, ప్రీతి రజక్ 134 పాయింట్లతో 8వ స్థానం దక్కించుకుంది.