ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ గెలిచి తోలుత బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లో 266 పరుగులు చేసింది. కాగా, 267 పరుగుల టార్గెట్ తో పాకిస్తాన్ చేజింగ్ కి దిగనుండగా.. వర్షంతో పాక్ ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు. దీంతో అంపైర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.
మొదటి ఇన్నింగ్స్ 7:44కి ముగిసింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ 8:14కి ప్రారంభించాల్సి ఉంది. మ్యాచ్ కటాఫ్ సమయాన్ని రాత్రి 10:27కి నిర్ణయించారు. అయితే అప్పటికీ వర్షం వర్షం ఆగకపోవడంతో 9:50కి మ్యాచ్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరుజట్లకు ఒక్కో పాయింట్ లభించింది. దీంతో పాకిస్తాన్ టీం సూపర్ 4కు అర్హత సాధించింది. ఆ జట్టు ఖాతాలో 3 పాయింట్లు ఉన్నాయి. టీమిండియా ఖాతాలో ప్రస్తుతం కేవలం ఒక్క పాయింట్ మాత్రమే ఉంది.