Saturday, November 23, 2024

వ్యాక్సినేషన్‌లో అమెరికాను దాటేసిన భారత్

క‌రోనా వ్యాక్సినేష‌న్‌ ప్రక్రియలో మన దేశం అమెరికాను దాటేసింది. జూన్ 28నాటికి ఇండియాలో 32,36,63,297 డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారు. అదే అమెరికాలో ఇదే స‌మ‌యానికి 32,33,27,328 డోసుల వ్యాక్సిన్ వేశారు. అయితే అమెరికా కంటే చాలా వేగంగా మ‌న ద‌గ్గ‌ర వ్యాక్సినేష‌న్ సాగుతోంది. అగ్ర‌రాజ్యం డిసెంబ‌ర్ 14న వ్యాక్సిన్లు ఇవ్వ‌డం ప్రారంభించ‌గా.. ఇండియాలో జ‌న‌వ‌రి 16న మొద‌లైంది. ఆదివారం 17.21 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్ ఇవ్వ‌డంతో భారత్ ఈ రికార్డు సాధించింది.

వ్యాక్సినేష‌న్ 163వ రోజు అయిన ఆదివారం 13.9 ల‌క్ష‌ల మంది తొలి డోసు తీసుకోగా.. 3.3 ల‌క్ష‌ల మంది రెండో డోసు తీసుకున్నారు. ప్ర‌స్తుతం కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసును 12-16 వారాల మ‌ధ్య ఇస్తుండ‌గా.. కొవాగ్జిన్ రెండో డోసు 4 వారాల త‌ర్వాత ఇస్తున్నారు. ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారంద‌రికీ కేంద్ర ప్ర‌భుత్వమే ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తున్న విష‌యం తెలిసిందే. తొలి రోజు రికార్డు స్థాయిలో 87 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement