Friday, November 22, 2024

రేపటినుంచి ఇండియా ఓపెన్‌.. మరోసారి టైటిల్‌ వేటలో పీవీ సింధూ

భారత్‌లో బ్యాడ్మింటన్‌ సెగ నేటి నుంచి ప్రారంభం కానుంది. జనవరి 17 నుంచి 22 వరకు జరగనున్న ఇండియా ఓపెన్‌ 2023లో కళ్ళు చెదిరే యాక్షన్‌ జరగబోతుంది. ఇటీవలె సూపర్‌ 750 స్టేటస్‌ పొందిన ఇండియా ఓపెన్‌ ఈ సారి అభిమానులకు వినోదం అందించనుంది. ఢిల్లిలోని ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ఈ గేమ్స్‌ జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు ప్రపంచనలుమూల నుంచి టాప్‌ ప్లేయర్లు రానున్నారు.

థాయ్‌లాండ్‌కు చెందిన షట్లర్‌ రచానోక్‌ ఇంటనన్‌, స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినా మారిన్‌, ఇండియా ఓపెన్‌లో కచ్చితంగా చూడదగిన మరో యాక్షన్‌, చైనా షట్లర్‌ హెబింగ్‌ జియావోదే, మలేసియా జోడి పియర్లి టాన్‌, తిన్నా మరళీధరన్‌, జపాన్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ చెన్‌ యుఫేయి, వరల్డ్‌ నెంబర్‌ వన్‌ అయిన జపాన్‌ షట్లర్‌ యమగూచి, భారత షట్లర్‌ పివి సింధూ ఈ టోర్నీలో ఆడనున్నారు. గతేడాదిలో జరిగిన కామన్‌ వెల్త్‌ గేమ్స్‌ మహిళల సింగిల్స్‌లో ఫుల్‌ సెట్‌ గోల్డ్‌, సిల్వర్‌, బ్రోంజ్‌ మెడల్‌ సాధించిన రెండో ప్లేయర్‌ రికార్డు సృష్టించింది.

కాగా ఈ భారత షట్లర్‌ ఆటకోసం చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈస్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ ఇండియా ఓపెన్‌ను రెండో సారి సొంతం చేసుకోవాలని ఉవ్వీళూరుతోంది. మహిళల సింగిల్స్‌లో ఇప్పటికే ఐదు ప్రపంచచాంపియన్‌ షిప్‌ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. రెండు ఒలింపిక్‌ మెడళ్లను గెలిచిన ఈ షట్లర్‌ ఇప్పుడు వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement