మహిళల క్వాలిఫైడ్ రౌండ్ లో ఫోర్త్ ప్లేస్..
క్వార్టర్ ఫైనల్స్ ప్రవేశం
పారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళల అర్చరీ జట్టు శుభారంభం చేసింది.. నేడు జరిగిన టీమ్ క్వాలిఫైడ్ ఈవెంట్ లో 1983 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో క్వార్డర్ ఫైనల్స్ కు దూసుకు వెళ్లారు.. భజన కౌర్, దీపిక కుమారిలతో పాటు అంకిత భకత్ అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్ టాప్-4లో నిలిచింది.
ఈ ముగ్గురు ఆర్చర్లు కలిసి 1983 పాయింట్లు సాధించారు. క్వార్టర్ ఫైనల్‌లో భారత మహిళా ఆర్చరీ జట్టు ప్రాన్స్ వర్సెస్ నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ విజేతతో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ క్వార్టర్ ఫైనల్ లో విజయం సాధిస్తే కొరియాతో తలపడే అవకాశం ఉంటుంది.
వ్యక్తిగత విభాగంలో అంకిత తృటిలో టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయింది. 666 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది. వెటరన్ దీపిక 658 పాయింట్లతో 23వ స్థానంలో నిలవగా, భజన్ కౌర్ 659 స్కోరుతో 22వ స్థానంలో నిలిచింది.
దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌ఐఎం సిహియోన్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్‌లో 12 రౌండ్లు ముగిసేసరికి 694 స్కోరుతో ప్రపంచ రికార్డు సృష్టించింది. టీమ్ ర్యాంకింగ్స్‌లో కూడా దక్షిణ కొరియా ఒలింపిక్ రికార్డ్ 2046 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనా 1966 పాయింట్లు, మెక్సికో జట్టు 1986 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మన ఎనిమిదో స్థానంలో నిలిచింది.
ఇక వ్యక్తిగత విభాగంలో భజన కౌర్, దీపిక కుమారి, అంకిత భకత్ లు అర్హత సాధించారు. అంకిత్ భగత్ 666 పాయింట్లతో 11వ స్థానం, భజన్ కౌర్ 659 పాయింట్లతో 22వ స్థానం, దీపికా కుమారి 658 పాయింట్లతో 23వ స్థానంలో నిలిచారు.. దీంతో 64మంది పాల్గొనే ఈ పోటీలలో పాల్గొనే అర్హత సాధించారు.