కొత్తగా దేశంలో 2,828కరోనా పాజిటీవ్ కేసులు నిర్థారణ అయ్యాయి. మొత్తం బాధితులు 4,31,53,043కు చేరారు. ఇందులో 4,26,11,370 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,586 మంది మరణించగా, మరో 17,087 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 14 మంది మహమ్మారి వల్ల మృతిచెందగా, 779 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.04 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.74 శాతంగా, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని తెలిపింది. అదేవిధంగా రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతంగా ఉందని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,93,28,44,077 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఇందులో శనివారం ఒకేరోజు 13,81,764 మందికి వ్యాక్సినేషన్ చేసినట్టు వెల్లడించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement