ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా ఇవ్వాల (ఆదివారం) జరుగుతున్న భారత్ వర్సెస్ నేపాల్ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపొయింది. టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేపట్టిన నేపాల్ జట్టు 37.5 ఓవర్లలో 6వికెట్ల నష్‌టానికి 178 పరుగులు చేసింది.
కాగా, ఈ మ్యాచ్ లో ఇప్పటివరకు నేపాల్ నుండి అత్యుత్తమ బ్యాటర్‌గా ఆసిఫ్ ఉద్భవించాడు.. నేపాల్ జట్టు నుంచి భారతదేశంపై హాఫ్ సెంచరీని కొట్టిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. కాగా, 30వ ఓవర్‌లో 58(97) పరుగుల తో సిరాజ్ చేతిలో అవుటయ్యాడు. కాగా, వీంద్ర జడేజా 3, మహమ్మద్ సిరాజ్ 2, షార్దుల్ టాకుర్ 1 వికెట్లను పడకొట్టారు.
భారతదేశం-నేపాల్ రెండింటికీ ఇది డూ-ఆర్-డై పరిస్థితి, ఈ గేమ్ లో ఓడిపోయిన జట్టు వారి బ్యాగ్‌లను సర్దుకుని ఇంటికి వెళ్లడమే. పాకిస్థాన్ ఇప్పటికే 3 పాయింట్లతో సూపర్ 4 కు అర్హత సాధించగా, ప్రస్తుతం భారత్ 1 పాయింట్‌తో రెండో స్థానంలో ఉంది. నేపాల్ ఇంకా ఏ పాయింట్‌ను సాధించలేకపోయింది.