ఫైనల్స్ లో అర్జున్ కి నాలుగు ప్లేస్..
రమితా జిందాల్ కి ఏడో స్థానం..
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ త్రుటిలో ఒక పతకం చేజార్చుకుంది. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్లో అర్జున్ బబుతా 208.4 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఒకదశలో రెండో స్థానంలో నిలిచిన అర్జున్ తర్వాత నాలుగో స్థానానికి పడిపోయి పతకాన్ని చేజార్చుకున్నాడు. అర్జున్ తన 13వ షాట్‌కు 9.9 పాయింట్లే సాధించాడు. తర్వాత పుంజుకున్న అతడు.. మళ్లీ 18వ షాట్‌కు 10.1 పాయింట్లు సాధించి నాలుగో స్థానానికి పడిపోయాడు.
చివరి షాట్‌కు అర్జున్ 10.5 పాయింట్లు సాధిస్తే పతకం సాధించేవాడు. కానీ, 9.5 పాయిట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచాడు. చైనా షూటర్ షెంగ్ లిహావో (252.2 పాయింట్లు) స్వర్ణం సాధించాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికా షూటర్ షానర్ విలియమ్ (251.6 పాయింట్లు)ని అధిగమించి ఒలింపిక్స్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. స్వీడన్‌కు చెందిన లిండ్‌గ్రెన్ విక్టర్ (251.4 పాయింట్లు) రజత పతకం దక్కించుకున్నాడు. క్రోయేషియా మారిసిక్ మీరాన్ (230.0 పాయింట్లు) కాంస్యం సాధించాడు.
రమితా జిందాల్ కు నిరాశ…
పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత మహిళా షూటర్ రమితా జిందాల్ పతకాన్ని కోల్పోయింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో రమితా జిందాల్ ఏడో స్థానంలో నిలిచింది. ఎనిమిది మంది షూటర్ల ఫైనల్లో 20 ఏళ్ల రమిత 145.3 స్కోర్ చేసింది. ఎలిమినేషన్లు ప్రారంభమైనప్పుడు ఆమె 10 షాట్ల తర్వాత ఏడో స్థానంలో ఉంది.
ఆ తర్వాత, ఆమె 10.5 షాట్‌తో ఆరో స్థానంలో నిలిచింది. దీంతో.. నార్వేకు చెందిన హేగ్ లియానెట్ దస్తాద్ నిష్క్రమించింది. తదుపరి షాట్లో రమిత ఔట్ అయింది. ఆదివారం జరిగిన క్వాలిఫికేషన్లో ఆమె ఐదో స్థానంలో నిలిచింది. తరువాతి రెండు షాట్లలో కూడా రమిత వెనుకబడిపోయింది. రమిత 10.2 షాట్‌తో ప్రారంభించి ఐదవ స్థానానికి చేరుకుంది. ఎలిమినేషన్ కంటే 0.2 పాయింట్లు ముందుంది. ఆ తర్వాత ఆమె మళ్లీ 10.2 షాట్ ఆడింది.
దీంతో.. రమిత ఆరో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత షూటాఫ్‌లో రమిత 10.5 స్కోర్ చేసింది. అయితే రమిత ప్రత్యర్థి ముల్లర్ 10.8 స్కోర్ చేయడం ద్వారా పోటీలో నిలబడ్డాడు. ఈ విధంగా రమిత ప్రయాణం ఏడో స్థానంతో ముగిసింది. ఇదిలా ఉంటే.. కొరియాకు చెందిన హ్యోజిన్ బాన్, షూట్ ఆఫ్‌లో చైనాకు చెందిన యుటింగ్ హువాంగ్ను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
స్విట్జర్లాండ్‌కు చెందిన ఆడ్రీ గోగ్నియట్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కాగా..రమితా జిందాల్ హాంగ్జౌ ఆసియా క్రీడల కాంస్య పతకం సాధించింది. దేశవాళీ ట్రయల్స్‌లో ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేతలు మెహులీ ఘోష్.. తిలోత్తమ సేన్లను ఓడించి పారిస్‌కు ఒలింపిక్స్‌కు వెళ్లింది.