కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు 192 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. స్కోరు 80 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ (44), పుజారా (0), విరాట్ కోహ్లీ (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇలాంటి సమయంలో శ్రేయాస్ అయ్యర్ (18), మయాంక్ అగర్వాల్ (85 నాటౌట్) కలిసి జట్టును ఆదుకున్నారు. ఇన్నింగ్స్ చక్కబెట్టారు. ఈ క్రమంలోనే జటస్టు స్కోరును 150 దాటించారు.
అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ (18) వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిగిరిగాడు. తొలి టెస్టు హీరో అయ్యర్ ఇలా అవుటవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. స్పిన్‌ను బాగా ఆడతాడని పేరున్న అతను.. ముదుకొచ్చి డిఫెన్స్ ఆడబోయాడు. కానీ ఆ బంతి అతని బ్యాట్‌కు తగిలి అతని ప్యాడ్స్‌కు బలంగా తాకింది. దీంతో బౌన్స్ అయిన బంతిని వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ చక్కగా అందుకున్నాడు.