భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న విమెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా విమెన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఆస్ట్రేలియా 10 ఓవర్లకు 69 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. దూకుడు పెంచిన క్రమంలో 8వ ఓవర్లో హేలీ 25 పరుగుల వద్ద అవుటయ్యింది. బౌండరీలు బాదుతూ ఆసిస్ జట్టు స్పీడ్ పెంచే క్రమంలో బౌండరీలు పోకుండా భారత జట్టు తీవ్రంగా కష్టపడుతోంది.
ఇక.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో వియజాలతో సెమీస్‌కు చేరిన టీమిండియాకు ఆ మ్యాచ్ ఆడే ముందు ఎదురుదెబ్బ తగిలింది. ఈ రోజు అంటే (ఫిబ్రవరి 23) సాయంత్ర 6:30 గంటలకు సెమీస్ మ్యాచ్ కోసం ఆసీస్ జట్టుతో భారత్ తలపడుతోంది. అయితే ఈ కీలక పోరుకు సిద్ధమవుతోన్న తరుణంలో టీమిండియా ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ గాయం కారణంగా వైదొలగింది. ఈ మేరకు రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాని ఆమె స్థానంలో తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది.