పురుషుల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో మన్‌ప్రీత్‌సింగ్ సారథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ భారతజట్టు దక్షిణ కొరియాతో తలపడింది. అయితే భారత్-దక్షిణికొరియా జట్లు 2-2 గోల్స్‌తో సమంగా నిలవడంతో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆరంభంలోనే అదరగొట్టిన భారతజట్టు నాలుగో నిమిషంలోనే తొలి గోల్ సాధించింది. లలిత్ ఉపాధ్యాయ్ మొదటి గోల్ సాధించగా అనంతరం వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌సింగ్ పెనాల్టి కార్నర్‌ను 18వ నిమిషంలో గోల్‌గా మలచడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఈ క్రమంలో పుంజుకున్న కొరియా మెరుగైన ప్రదర్శనతో టీమిండియాను అడ్డుకుంది.
41వ నిమిషంలో కొరియా ప్లేయర్ జాంగ్, 46వ నిమిషంలో సంగ్‌హ్యూన్ కిమ్ చెరో గోల్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ముగింపుదశలో మన్‌ప్రీత్‌సేనకు పెనాల్టి కార్నర్‌లతో సహా చాలా అవకాశాలు లభించినా గోల్స్‌గా మలచడంలో విఫలమవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తదుపరి మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital