Saturday, November 23, 2024

స్టూడెంట్‌ వీసాల్లో భారత్‌ టాప్‌..

అమెరికా జారీ చేసిన స్టూడెంట్‌ వీసాల్లో అధికభాగం భారతీయ విద్యార్థులకే లభించాయి. 2022 సంవత్సరంలో 82వేల వీసాలు మంజూరయ్యాయి. ప్రపంచంలో మరే దేశానికీ ఈ స్థాయిలో విద్యార్థి వీసాలు లభించలేదని తాజా నివేదికలో వెల్లడైంది. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారిలో భారతీయులు 20 శాతం మంది ఉన్నారు. 2020-21 విద్యా సంవత్సరంలోనే దాదాపు 1.7 లక్షల మంది ఇండియా నుంచి అమెరికా చేరుకున్నారని ఓపెన్‌ డోర్స్‌ నివేదిక పేర్కొంది. కొవిడ్‌-19 మహమ్మారి తర్వాత, విద్యార్థులు తిరిగి యూనివర్సిటీలకు చేరుకోవడం సంతోషానిస్తున్నదని పాట్రిసియా లాసినా చెప్పారు. ఈ ఏడాది వేసవిలో82వేల వీసాలు ఇవ్వడం జరిగింది.

ఈ సంఖ్య గతేడాది కంటే అధికం. రెండు దేశాల మధ్య జీవన అనుబంధాన్ని పెంపొందించడంలో భారతీయ విద్యార్థుల పాత్ర కీలకమైందని చెప్పారు. అంతర్జాతీయ సవాళ్లపై ఇరుదేశాలు కలసికట్టుగా పనిచేస్తున్నాయని అన్నారు. అంతర్జాతీ విద్యార్థులను తిరిగి అమెరికా యూనివర్సిటీలకు చేర్చడం మా దౌత్యపాలసీలో ముఖ్యమైనదని కాన్సులర్‌ అఫైర్స్‌ కౌన్సెలర్‌ డాన్‌ హెఫ్లిన్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement