Tuesday, November 19, 2024

విదేశీ మారక నిల్వల్లో టాప్‌-4 దేశంగా భారత్‌: కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరీ

న్యూఢిల్లీ: విదేశీ మారక నిలల్లో భారత్‌ క్రమంగా మెరుగుపడుతోంది. అధిక విదేశీ మారక నిలలు కలిగివున్న దేశాలో భారత్‌ నాలుగో స్థానానికి చేరిందని లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి పంకజ్‌ చదరీ ప్రకటించారు. నవంబర్‌ 19, 2021 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 640.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని వెల్లడించారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. పీ-నోట్స్‌/ ఓడీఐ (ఆఫ్‌షోర్‌ డెరివేటివ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌), ఓడీఐల ప్రయోజదారు యజమాల వివరాలను నెలవారీగా సెబీకి వెల్లడిస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఓడీఐలు ఇష్యూ చేసే ఎఫ్‌పీఐల ఆధారంగా వివరాలను తెలియజేస్తున్నట్టు వివరించారు. మరో ప్రశ్నకు మంత్రి చదరీ సమాధానమిస్తూ.. పెట్రోలియం ఉత్పత్తులపై వసూలైన సెస్సులు సహా గత ఏడు ఆర్థిక సంవత్సరాలు 2014- 15 నుంచి 2020-21 స్థూల ఎక్సైజ్‌ డ్యూటీ రూ.16.7 లక్షల కోట్లకుపైగానే ఉందని ఆయన మంత్రి వివరించారు. 2013-14లో అన్‌బ్రాండెడ్‌ పెట్రోల్‌పై స్థూల ఎక్సైజ్‌ డ్యూటీ లీటర్‌పై రూ.9.2గా ఉంది. అన్‌బ్రాండెడ్‌ డీజెల్‌పై రూ.3.46గా ఉన్నాయి. కాగా ప్రస్తుతం అన్‌బ్రాండెడ్‌ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వ స్థూల ఎక్సైజ్‌ డ్యూటీ లీటర్‌పై రూ.27.9 కాగా అన్‌బ్రాండెడ్‌ డీజెల్‌పై రూ.21.80గా ఉంది. మౌలిక, అభివృద్ధి పనుల కోసం నిధుల సేకరణకై పెట్రోల్‌, డీజెల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీని వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement