Monday, November 18, 2024

జీ-20 అధ్యక్ష బాధ్యతలు భారత్‌ చేపట్టడం గర్వకారణం : ప్రధాని మోదీ

ఢిల్లీ : జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్‌ చేపట్టడం గర్వకారణ‌మ‌ని భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మాట్లాడారు. త్వరలో మన్‌కీ బాత్‌ 100వ ఎపిసోడ్ రాబోతుంద‌న్నారు. ప్రజలతో ఈ కార్యక్రమంలో మమేకం కావడం సంతోషకరం అన్నారు. విద్యార్థులు జీ20 కూటమి లక్ష్యాలను తెలుసుకోవాల‌న్నారు. సిరిసిల్లకు చెందిన హరి ప్రసాద్‌ నాకు లేక రాశారని, జీ20కి సంబంధించి నాకు మంచి సూచనలు చేశారన్నారు.

ప్రధాని నోట సిరిసిల్ల నేతన్న మాట
ఈరోజు ‘‘మన్ కీ బాత్ ’ కార్యక్రమంలో ప్రధాని చేతిలో సిరిసిల్ల చేనేత వస్త్రం తళుక్కున మెరిసింది. చేనేత కార్మికుడు హరి ప్రసాద్ జీ-20 పేరుతో చేతితో స్వయంగా నేసిన వస్త్రాన్ని నరేంద్ర మోదీ చూపించారు. చేనేత కార్మికుల గొప్పదనాన్ని, కళా నైపుణ్యాన్ని వివరిస్తూ ప్రధాని అభినందించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆసక్తిగా తిలకించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement