మహిళల ఆసియా హాకీ 5 ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో రౌండ్ లో నేడు మలేషియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాదించింది. ఈ మ్యాచ్ లో 9-5 స్కోర్ తో మలేషియాను చిత్తుగా ఓడించింది. హ్యాట్రిక్ విన్ తో ఈ టోర్నీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో పాటు వచ్చే ఏడాది ప్రపంచ కప్‌కు కూడా అర్హత సాధించింది. ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్ వచ్చే ఏడాది జనవరి 24 నుండి 27 వరకు మస్కట్‌లో జరుగుతుంది.
కాగా, నేటి మ్యాచ్ లో కూడా దూకుడుగానే ప్రారంభించింది భారత్.. ఇక, మొదటి అర్ధభాగంలో ఒక నిమిషం మిగిలి ఉండగానే, చౌదరి చేసిన గోల్ తో భారత్ తన ఆధిక్యాన్ని పెంచుకుంది. దీంతో, బ్రేక్ టైమ్ కి మలేషియాపై భారత్ 5-3 ఆధిక్యంలో ఉంది. సెకండాఫ్‌లో రెండు జట్లూ పోటా పోటీ తలపడ్డాయి.. ఇక గేమ్ లో మరో నాలుగు నిమిషాలు మిగిలి ఉండగానే భారత్ ప్లేయర్ జ్యోతి తొమ్మిదో గోల్ చేసింది. దీంతో 9-5 తేడాతో మలలేషియాపై గెలిచింది భారత్. ఇక టోర్నీలో జరిగే రెండో సెమీ ఫైనల్ లో థాయ్‌లాండ్, ఇండోనేషియా తలపడనుండగా.. వీరిలో గెలిచిన జట్టు తో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.