Friday, November 22, 2024

BWF Championship | క్వార్టర్ ఫైనల్లో భార‌త్.. మరి కొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం

BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్ ప్రపంచ ఈవెంట్‌లో ఇవ్వాల (శుక్రవారం) ముగ్గురు భారతీయ స్టార్లు.. సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి & హెచ్‌ఎస్ ప్రణయ్ ఆడ‌నున్నారు. సాత్విక్-చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన ఆండర్స్ స్కారప్ రాస్ముస్సేన్-కిమ్ ఆస్ట్రప్‌తో ఆడుతుండగా… పురుషుల సింగిల్స్ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ డెన్మార్క్‌కు చెందిన విక్టర్ అక్సెల్‌సెన్‌తో తలపడనున్నాడు. కాగా, ప్రపంచ ఛాంపియన్‌షిప్ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్ మ‌రి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది..

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నిన్న (గురువారం) జరిగిన మ్యాచ్ లో భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ సింగపూర్‌కు చెందిన మాజీ ఛాంపియన్ లోహ్ కీన్ యూపై మూడు గేమ్‌ల పోరులో విజయం సాధించి వరుసగా మూడో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రపంచ 9వ ర్యాంకర్ ప్రణయ్ రాయల్ ఎరీనాలో ఏడో సీడ్ ఆటగాడిపై 21-18, 15-21, 21-19 తేడాతో తన అద్భుతమైన పోరాట లక్షణాలను ప్రదర్శించాడు.

- Advertisement -

భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి క్వార్టర్‌ఫైనల్‌కు చేర‌గా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకానికి మరో అడుగు దూరంలో ఉన్నారు. ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కార్నాండో-డేనియల్ మార్థిన్‌లపై వీరిద్దరూ మూడు గేమ్‌ల విజయాన్ని నమోదు చేశారు.

2021 ఎడిషన్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ప్రపంచ 11వ ర్యాంకర్ లక్ష్య సేన్.. థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావుట్ విటిడ్‌సర్న్‌ను అధిగమించలేకపోయాడు, టోర్నమెంట్ నుండి 14-21, 21-16, 13-21తో ఓడిపోయాడు. మరోవైపు, మహిళల డబుల్స్ జంట ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ 42 నిమిషాల ఆటో చైనా టాప్ సీడ్ ద్వయం చెన్ క్వింగ్ చెన్-జియా యి ఫ్యాన్‌పై 14-21 9-21 తేడాతో ఓడిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement