Friday, November 22, 2024

అవినీతి సూచీలో భారత్‌ కాస్త మెరుగు..

ప్రపంచ అనినీతి సూచీలో భారత్‌ ఒక స్థానాన్ని మెరుగుపరచుకుంది. కరెప్షన్‌ పర్సెప్షన్‌ ఇండెక్స్‌(సీపీఐ) 2021లో భారత్‌ 85వ స్థానంలో నిలిచింది. మొత్తం 180 దేశాలకుగానూ గతేడాది 86వ ర్యాంకు నుంచి ఒక స్థానం మెరుగుపడింది. ఈ మేరకు ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్‌ తాజా రిపోర్ట్‌ను విడుదల చేసింది. అవినీతి విషయంలో గత దశాబ్ద కాలంగా భారత స్కోరు స్థిరంగా ఉంటోంది. కొన్ని వ్యవస్థల ప్రభావంతో అవినీతి తగ్గుదలకు కారణమని రిపోర్ట్‌ వివరించింది. అవినీతి ర్యాంక్‌లో మెరుగుపడినా భారత్‌లో ప్రజాస్వామ్యం స్థితిపై రిపోర్ట్‌ ఆందోళన వ్యక్తం చేసింది. డెన్మార్క్‌, ఫిన్‌లాండ్‌, న్యూజిలాండ్‌, నార్వే దేశాలు అత్యధిక స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో అవినీతి స్థాయిని బట్టి దేశాలకు 0 – 100 వరకు పాయింట్లను కేటాయించారు. 0 పాయింట్‌ గరిష్ఠ అవినీతిని, 100 పాయింట్లు అవినీతిలేమిని సూచిస్తుంది. బలహీన స్కోరు పొందిన దేశాల్లో అత్యధిక జనాభా కలిగిన దేశాలే ఎక్కువగా ఉన్నాయి. అవినీతి స్కోరులో చైనా (45), ఇండియా(40), ఇండోనేసియా(38), పాకిస్తాన్‌(28), బంగ్లాదేశ్‌(26) స్కోర్లు వచ్చాయి. దీంతో భారత పొరుగు దేశాల్లో భూటాన్‌ మినహా మిగతా దేశాల్లో భారత్‌ దిగువ స్థానాలకే పరిమితమయ్యాయి. అవినీతి సూచీలో పాకిస్తాన్‌ అంతక్రితం ఏడాదితో పోల్చితే 16 స్థానాలు దిగజారింది.

ప్రజాస్వామ్యంపై ఆందోళన..
అవినీతి సూచీలో మెరుగుపడినా భారత్‌లో ప్రజాస్వామ్య స్థితిపై ట్రాన్ఫరెన్సీ ఇంటర్నేషనల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాథమిక స్వేచ్ఛ, సంస్థాగత కార్యనిర్వహణ, సమతుల్యతలు తగ్గాయని రిపోర్ట్‌ పేర్కొంది. జర్నలిస్టులు, ఉద్యమకారులు ముప్పుపొంచివున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు, రాజకీయ తీవ్రవాదులు, క్రిమినల్‌ గ్యాంగులు, అవినీతి స్థానిక అధికారుల దాడుల్లో బాధితులు అవుతున్నారని పేర్కొంది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడే పౌరసమాజ సంస్థలు లక్ష్యంగా దాడులు చేస్తున్నారని వివరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement