Tuesday, November 26, 2024

బోణి కొట్టిన భారత్‌.. లంకతో తొలి టీ20లో టీమిండియా సూపర్‌ విక్టరీ

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన లంకతో తొలి టీ 20లో భారత్‌ విజయ కేతనం ఎగరేసి బోణి కొట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ లో 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ తొందరగానే వెనుదిరిగాడు. 7 పరుగుల వద్ద తీక్షణ బౌలింగ్‌లో ఎల్బీగా అవుట్‌ అయ్యాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌ సిరీస్‌లో డబుల్‌ సెంచరీ చేసిన ఇషాన్‌ రెచ్చిపోయి ఆడుతున్నాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 18 పరుగులు చేశాడు. టాస్‌ గెలిచిన శ్రీలంక కెప్టెన్‌ శనక ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. శుభమన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్లుగా వచ్చారు. భారత పర్యటనలో శ్రీలంక మూడు టీ 20 సిరీస్‌లు ఆడుతుంది. రెండో టీ 20 జనవరి 5న, మూడో టీ 20 జనవరి ఏడోతేదీన జరగనున్నాయి. హార్థిక్‌ పాండ్యా నేతృత్వంలోని కుర్రాళ్లతో కూడిన జట్టుని బీసీసీఐ ప్రకటించింది.

- Advertisement -

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కెఎల్‌ రాహుల్‌ వంటి సీనియర్లు లేకుండానే బరిలోకి దిగింది. వీళ్లంతా వన్డే సిరీస్‌లో జట్టుతో కలవనున్నారు. గాయం నుంచి కోలుకుని ఫిట్‌గా ఉన్న సీనియర్‌ పేసర్‌ బుమ్రా కూడా వన్డే మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు. టీమిండియాకు షాక్‌. పవర్‌ ప్లేలోనే భారత్‌ రెండు వికెట్లు కోల్పోయింది. కరుణరత్నే బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ అవుట్‌ అయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన అతను రాజపక్సే క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ ( 7 పరుగులు) కూడా తక్కువ పరుగులకే తీక్షణ బౌలింగ్‌లో ఎల్బీగా అవుట్‌ అయ్యాడు. వికెట్లు పడుతున్నా కూడా ఇషాన్‌ కిషన్‌ దూకుడుగా ఆడాడు.

శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే ఆల్‌రౌండర్లు దీపక్‌ హుడా 41, అక్షర్‌ పటేల్‌ 31 ఆఖర్లో దూకుడుగా ఆడడంతో 20 ఓవర్లకు 162 పరుగులు చేసింది. వీరిద్దరూ ఐదో ఆరో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం నిర్మించారు. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ తొలి ఓవర్‌ నుంచే లంక బౌలర్ల మీద విరుచుకు పడ్డాడు. అయితే శుభమన్‌ గిల్‌(7), సూర్యకుమార్‌ యాదవ్‌ (7)లు వెంట వెంటనే అవుట్‌ కావడంతో భారత్‌ ఒత్తిడిలో పడింది. దూకుడుగా ఆడే క్రమంలో ఇషాన్‌ 37 రన్స్‌ వద్ద అవుట్‌ అయ్యాడు. ఆ వెంటనే పాండ్యా 39 పరుగులు చేసి వెనుదిరిగాడు. సంజూ శాంసన్‌ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ధనుంజయ వేసిన 7వ ఓవర్‌లో అతను భారీ షాట్‌కు ప్రయత్నించాడు. మధు శనక క్యాచ్‌ పట్టడంతో శాంసన్‌ నిరాశగా పెవిలియన్‌ బాటపట్టాడు. కెప్టెన్‌ హార్థిక్‌ పాండ్యా వరుసగా బౌండరీలు బాదుతూ శ్రీలంక బౌలర్ల మీద ఒత్తిడి పెంచారు. శ్రీలంక బౌలర్లలో మధుషనక, తీక్షణ, కరుణరత్నే, డిసిల్వా, హసరంగా తలో వికెట్‌ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement