ఉక్రెయిన్ వ్యవహారంలో మేం ఏం చేయాలో మీరు చెప్పనక్కర్లేదు.. ఏం చేయాలో మాకు తెలుసంటూ నెదర్లాండ్స్ కు భారత్ స్పష్టం చేసింది. ఐరాస భద్రతామండలి భేటీ సందర్భంగా నెదర్లాండ్స్ దత్యవేత్త చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య పేరుతో దాడి చేయడాన్ని తప్పు పడుతూ ఐరాస జనరల్ అసెంబ్లి, మానవహక్కుల విభాగాల్లో ఓటింగ్ కోసం చేస్తున్న ప్రయత్నాలను భద్రతామండలిలో సభ్యురాలైన ఇండియా అడ్డుకుంటోందని, యూఎన్ చాప్టర్‌ను గౌరవించి ఆ ప్రయత్నాలను విరమించుకోవాలంటూ యూకే, ఐర్లాండ్‌లలో నెదర్లాండ్స్ దత్యవేత్త కార్ల్ వాన్ ఊస్టెరోమ్ చేసిన వ్యాఖ్యలపై భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి తిప్పికొట్టారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని, ప్రపంచంపై తీవ్ర ప్రభావం పడుతుందని, దౌత్యమార్గాల్లో సమస్య పరిష్కరించుకోవాలని, భారత్ ఎప్పుడూ శాంతిపక్షమేనని పునరుద్ఘాటించారు. యుద్ధ క్షేత్రాల్లో చిక్కుకుపోయినవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తక్షణం మానవతా సాయం అందించాలని భారత్ కోరిన విషయాన్ని గుర్తు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..