భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు రాణించింది. కొలంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక ను తక్కువ పరుగులకే కట్టడి చేయగలిగింది. బౌలర్లు అక్షర్ పటేల్ (2/33), అర్షదీప్ సింగ్ (2/47) రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్ (1/36), శివమ్ దూబే (1/19), కుల్దీప్ యాదవ్ (1/33), వాషింగ్టన్ సుందర్ (1/46) ఒక్కో వికెట్ తీశారు.. దీంతో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు సాధించింది.
కాగా, శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ పాతుమ్ నిస్సంక (56), దునిత్ వెల్లలాగే (62 నాటౌట్) జట్టును ఆదుకున్నారు. వీరు మినహా మిగితా ఎవ్వరూ అంతగా రాణించలేకపోయారు. దీంతో శ్రీలంక జట్టు 230 పరుగులకే పరిమితమైంది. ఇక 231 పరుగుల లక్ష్యంతో భారత్ ఛేజింగ్ ప్రారంభించనుంది.