Tuesday, November 19, 2024

మరో కలవరం.. భారత్‌లో 40 డెల్టా ప్లస్ కేసులు

దేశంలో కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పడుతుందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరో కరోనా వేరియంట్ ప్రజలను కంగారెత్తిస్తోంది. డెల్టా వేరియంట్‌లో సంభవించిన మ్యుటేషన్ కారణంగా పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 40 డెల్టా ప్లస్ వేరియంట్ (B.1.617.2) కరోనావైరస్ కేసులు నమోదైనట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఎక్కువ కేసులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడులోనే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ వేరియంట్ ఆందోళనకరమైందని, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఈనెల 16న దేశంలో తొలిసారిగా డెల్టా ప్లస్ వేరియంట్‌ను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement