Friday, November 22, 2024

IndvsAfg 3rd T20 | సిరీస్‌ క్లీన్ స్వీప్‍పై భారత్ క‌న్ను

అఫ్గానిస్థాన్‍తో ఆఖరి పోరుకు భారత్ సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య రేపు (జనవరి 17) మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే వ‌రుస‌గా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్‍ చేయాలని చూస్తుంది. మరోవైపు పసికూన అఫ్గాన్‌ కూడా ఎలాగైన చివరి మ్యాచ్‌లో గెలిచి తమ పరవు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

యువ ఆల్‌రౌండర్లు శివం దూబే, అక్షర్‌ పటేల్‌ ఈ సిరీస్‌లో చిరస్మరణీయ ప్రదర్శనలు చేస్తున్నారు. పేస్‌ ఆల్‌రౌండర్‌ దూబే రెండు మ్యాచుల్లో 123 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. ఇతను వరుసగా రెండు మ్యాచుల్లో అజేయ హాఫ్‌ సెంచరీలతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా కొనసాగుతున్నాడు.

అలాగే స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ కూడా ఈ సిరీస్‌లో ఆకట్టుకుంటున్నాడు. బ్యాటింగ్‌ చేసే అవకాశం లభించక పోయినా బౌల్‌తో మాత్రం గొప్పగా రాణిస్తున్నాడు. రెండు మ్యాచుల్లో ఇతను 4 వికెట్లు పడగొట్టాడు. ఆదిలోనే ప్రమాదకరమైన బ్యాటర్లను ఔట్‌ చేస్తూ అఅఫ్గాన్‌ ను కట్టడి చేస్తున్నాడు.

మరోవైపు అర్ష్‌దీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌ కూడా పర్వాలేదనిపిస్తున్నారు. ఇక బ్యాటింగ్‌ విషయానికి వస్తే తొలి మ్యాచ్‌లో గాయం కారణంగా ఉన్న యశస్వి జైస్వాల్‌ రెండో మ్యాచ్‌లో 68 పరుగులతో సత్తా చాటుకున్నాడు. ఇక వీరందరూ మరోసారి రాణిస్తే టీమిండియాకు భారీ విజయం ఖాయం.
రోహిత్‌పైనే అందరి దృష్టి..

- Advertisement -

అయితే, చాలా కాలం తరువాత భారత టీ20 జట్టులోకి మళ్లీ వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలి రెండు మ్యాచ్‍ల్లో డకౌట్ అయ్యాడు. దీంతో మూడో మ్యాచ్‍లో దుమ్మురేపాలని కసిగా ఉన్నాడు. రెండో మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ మంచి టచ్‍లో కనిపించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement