Friday, November 22, 2024

ప్రాణమిత్ర భార‌త్….

  • కోవిడ్‌ నియంత్రణలో చాకచక్యం
  • వ్యాక్సిన్‌తో ప్రపంచ దేశాలకు సంజీవని
  • వ్యాక్సిన్‌ మైత్రి ప్రోగ్రామ్‌తో వైద్య సేవలు
  • పేద దేశాలకు ఉచితంగా టీకా సరఫరా
  • విశ్వమానవ సౌభ్రాతృత్వానికి పెద్దపీట
  • ప్రపంచ దేశాల నుంచి భారత్‌కు ప్రశంసలు
  • అప్పుల దశ నుంచి ఆదర్శ దేశంగా ప్రఖ్యాతి

న్యూఢిల్లీ – భారత్‌ ప్రపంచ మానవళి ప్రాణదాతగా అవతరించింది. ప్రపం చాన్ని కుదిపేసిన కోవిడ్‌ను ఎదుర్కోవడంలో భారత్‌ చాకచక్యంగా వ్యవహరించింది. విస్తరణను వేగంగా నియంత్రించగలిగింది. అంతే వేగంతో కోవిడ్‌ నియంత్రణ చేయగల వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. భారత ప్రజలకు అందించడం మొదలెట్టింది. అదే సమ యంలో కోవిడ్‌తో సతమతమౌతున్న పలు దేశాలకు వ్యాక్సిన్‌ సర ఫరా మొదలెట్టింది. ఇప్పుడు భారత్‌ ఈ దేశాల పాలిట సంజీవనిగా మారింది. ఒకప్పుడు భారత్‌ అంటే దీర్ఘకాలంగా అభివృద్ధి చెందు త ున్న దేశాల జాబితాకే ఇది పరిమితం. రోజువారి నిర్వహణకు కూడా విదేశీ అప్పులపై ఆధారపడుతుందన్న అపప్రద. ఆఖరకు బంగా రాన్ని తాకట్టుపెట్టి ఖర్చులు గడుపుకుంటుందన్న పరిస్థితి. అలాంటి భారత్‌ ఇప్పుడు ప్రపంచానికే ఆదర్శనీయమైంది. భారత్‌తో మైత్రికి ప్రపంచ దేశాలు తహతహలాడుతున్నాయి. తమ కళ్ళముందే దారుణ పరిస్థితుల్లో కన్నుమూస్తున్న సొంత ప్రజల్ని కాపాడుకోలేని అశక్తతో సతమతమౌతున్న దేశాలన్నీ ఇప్పుడు భారత్‌వైపు చూస్తున్నాయి. భారత్‌ను ప్రాధేయప డుతున్నాయి. వ్యాక్సిన్‌ తమకు కూడా సరఫరా చేసి తమ ప్రజల ప్రాణాల్ని రక్షించమంటూ అభ్యర్థిస్తున్నాయి. భారత్‌తో మైత్రి కోసం తహతహలాడుతున్నాయి.
భారత్‌ తన ప్రాచీన కాలం నుంచి అలవర్చుకున్న విధానాన్ని ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కూడా కొనసాగిస్తోంది. విశ్వమానవ సౌభ్రాతృత్వానికి ప్రాధాన్యతనిస్తోంది. వశుదైక కుటుంబ విధానాన్ని ఆచరణలో పెట్టింది. ప్రపంచంలో ఏ దేశానికి చెందిన ప్రజల ప్రాణాలైనా ఒకటేనని తలపోస్తోంది. ఒకవైపు తన ప్రజలకు వ్యాక్సిన్‌ అందిస్తూనే జనవరి 21నుంచి ఇండియా వ్యాక్సిన్‌ మైత్రి ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్‌ క్రింద ఈ నెల 5వ తేదీ సాయంత్రం 8గంటల వరకు మొత్తం 50దేశాలకు 47.626 మిలియన్‌ వ్యాక్సిన్‌లను సరఫరా చేసింది. ఇందులో కెనడా వంటి జీ7 సభ్యదేశం కూడా ఉంది. ఆ దేశానికి భారత్‌ పెద్దెత్తున వ్యాక్సిన్‌ పంపించింది. ఐక్యరాజ్య సమితిలో పని చేసే ఆరోగ్య కార్యకర్తల కోసం కూడా వ్యాక్సిన్‌ను భారతే అందించింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ విస్తరణను భారత వ్యాక్సిన్‌లు అడ్డుకుంటున్నాయి. ఈ వ్యాక్సి న్‌ల సరఫరా కోసం వివిధ దేశాల నుంచి భారత్‌కు విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. పేద దేశాలన్నీ ఉచితంగా అందించమంటున్న అభ్యర్థనను భారత్‌ సానుకూలంగా ఆమోదిస్తోంది. ఇప్పటికే ఇలా 7.35మిలియన్‌ వ్యాక్సిన్‌లను పేద దేశాలకు ఉచితంగా సరఫరా చేసింది. ఇందుకైన రవాణా వ్యయాన్ని కూడా భారతే భరించింది. కోవిడ్‌ మహమ్మారిపై పోరాట ంలో మానవులందరికీ సహాయపడాలన్న కృతనిశ్చయంతో ముందుకెళ్తోంది. టీకా ఉత్పత్తి, పంపిణీ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తోంది.
కోవిడ్‌ బారిన పడ్డ ప్రధాన దేశాల్లో బ్రెజిల్‌ ఒకటి. ఆ దేశానికి ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో నాలుగు మిలియన్‌ వ్యాక్సిన్లు సరఫరా అయ్యాయి. వ్యాక్సిన్‌ను బ్రెజిల్‌కు మోసు కొచ్చిన విమానాన్ని సాక్షాత్తు హనుమంతుడిగా బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సో నారో కీర్తించారు. సాక్షాత్తు హనుమంతుడే తమ దేశానికి సంజీవనని తీసుకొచ్చాడంటూ శ్లాఘించారు. ఈ సంజీవనిని రామాయణంలో రాముడు లాంటి భారత ప్రధాని మోడి తమకు కానుకగా పంపించారంటూ ప్రస్తుతించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ విడుదల చేశారు.
టీకాల విషయంలో భారత్‌ అంతర్జాతీయ వాదాన్ని అనుసరి స్తోంది. కేవలం ఆర్థికంగా, సాంకేతికంగా ఉన్నత స్థానంలో ఉన్న దేశాలకే పరిమితం కాకుండా పేద దేశాలకు కూడా టీకానందించాల్సిన అవసరాన్ని పదే పదే నొక్కి చెబుతోంది. ఆఫ్రికా నుండి కరేబియన్‌, ఆసియన్‌ దేశాల వరకు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలన్నింటికి వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యంగా ప్రకటించింది. కెనడాకు ఇప్పటి వరకు ఐదులక్షల వ్యాక్సిన్‌లను సరఫరా చేసింది. ఆ దేశ భారత రాయబారి అజయ్‌ దిసారియా భారత నిర్ణయానికి తమ కృతజ్ఞతలు ప్రకటించారు. వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంలో కెనడాను వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌ భావించడం తమ దేశానికి గర్వంగా పేర్కొన్నారు. కరేబియన్‌ దేశాలైన బార్బడోస్‌, డొమినెక, సెయింట్‌ లూసియా, సెయింట్‌ కిట్స్‌, సెయింట్‌ మిన్సెంట్‌, గ్రెనడిన్స్‌, ఆంటిగ్వా, బార్బుడా దేశాలకు కూడా భారత్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరా చేసింది. ఈ విషయంలో భారత ఔదార్యాన్ని విదేశాలు ఉవ్వెత్తున ప్రస్తు తిస్తున్నాయి. ఆంటిగ్వా ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌ ఓ ప్రకటనలో ప్రధాని నరేంద్రమోడి ప్రపంచం పట్ల దయ చూపుతున్నా రంటూ పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం ప్రపంచంలోని ఏ నాయకుడి విషయంలోనూ కనిపించడం లేదన్నారు. గత వందేళ్ళలో ప్రపంచం చూసిన అత్యంత దయాదాక్షిణ్యాల్లో ఇది ముఖ్య మైందంటూ చెప్పుకొచ్చారు. కరేబియన్‌ నాయకుల బార్బ డోస్‌ ప్రధాని ముయాఅమోర్‌మోట్లీ తన ట్వీట్‌లో భారత్‌కు కృత జ్ఞతలు ప్రకటించారు. తమ దేశంలోని 40వేల మందికి పైగా భారత్‌ ఉదారత కారణంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ను స్వీకరించగలి గారన్నారు. ఇది నిజమైన ఔదార్యానికి ప్రతీకగా అభినందిం చారు. ప్రపంచ ఆరోగ్యం కోసం భారత్‌ పడుతున్న తపనను అభినందించారు. అమెరికా, కెనడా, బ్రెజిల్‌, మెక్సికో, అర్జంటీ నాలతో సహా 34దేశాల బృందంతో కూడిన ఆర్గనైజేషన్స్‌ ఆఫ్‌ అమెరికన్‌ స్టేట్స్‌ ఆమోదించిన తీర్మానంలో కరేబియన్‌ దేశాలు భారత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించాయి. ఈ ఆర్గనైజేషన్స్‌ ఆఫ్‌ అమెరికన్‌ స్టేట్స్‌ శాశ్వత మండలి రాయబారి రోనాల్డ్‌ సోండర్స్‌ విడుదల చేసిన ప్రకటనలో ప్రపంచ సంక్షోభ సమయంలో అంతర్జాతీయ సహకారానికి భారత్‌ చర్యలు ఉదాహరణగా పేర్కొన్నారు. ఎలాంటి షరతుల్లేకుండా ఔదా ర్యంతో భారత్‌ అందిస్తున్న ఆరోగ్య సహకారం ప్రపంచ చరి త్రలో గుర్తుండి పోతుందని అభిప్రాయం వెల్లడించారు. ఈ వ్యాక్సిన్‌ మైత్రి మరింతగా ముందుకు సాగుతోంది. ఆరోగ్య సంక్షోభ సమయంలో ప్రపంచ నాయకుడిగా భారత్‌ తన పాత్రను మరింతగా విస్తరిస్తోంది. ఆఫ్రికా, ఘనా, ఐవెరికోస్ట్‌, కాంగో, అంగోలా, నైజీరియా, కెన్యా, లెసోటో, రువాండ, సెనెగల్‌, సుడాన్‌, ఆసియన్‌, కంబోడియా, దేశాలు కోవాక్స్‌ సౌకర్యం క్రింద భారత్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ను పొందగలిగాయి. అమెరికాతో సహా తన మిత్రదేశాలు పాకిస్థాన్‌కు టీకాల సరఫరాకు నిరాకరించాయి. భారత్‌ను ఆగర్భ శత్రువుగా చూసే పాకిస్థాన్‌కు కూడా భారత్‌ ఉదారంగా టీకాలందించింది. భారత టీకాలకు ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌, మాల్ది వులు, నేపాల్‌, బంగ్లాదేశ్‌లు తమ ప్రజలకు వినియోగిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామ్య దేశంతో పాటు టీకాల్ని అధికంగా ఉత్పత్తి చేయగలిగే భారత్‌ తమ పట్ల ఇంతటి ఉదారతను చూపుతోందంటూ ఆఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు అశ్రత్‌ఘని తన కృతజ్ఞతలు తెలిపారు.

మిలియ‌న్ డోస్ లు వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా..
భారత్‌ ఇప్పటివరకు గరిష్టంగా బంగ్లాదేశ్‌కు 9మిలియన్‌ వ్యాక్సిన్‌లను సరఫరా చేసింది. మయన్మార్‌కు 3.7, నేపాల్‌కు 2,0, భూటాన్‌కు 1.5, మాల్దిdవ్స్‌కు 2.0, మారిషస్‌కు 2.0, సీచెల్స్‌కు 0.5, శ్రీలంకకు 1, బెహరెన్‌కు 0.1, బ్రెజిల్‌కు 4, మొరాకోకు 7, ఒమన్‌కు 0.1, ఈజిప్ట్‌కు 0.05, అల్జిdరియాకు 0.05, దక్షిణాఫ్రికాకు 1, కువైట్‌కు 0.2, యూఏఈకి 0.2, ఆఫ్ఘనిస్థాన్‌కు 0.5, బార్బడోస్‌కు 0.01, డొమినికాకు 0.07, మెక్సికోకు 0.87, డొమినిక రిపబ్లిక్‌కు 0.05, సౌదీఅరేబయాకు 3, ఎల్‌సాల్విడార్‌ 0.02, అర్జెంటీనాకు 0.58, సెర్బియాకు 0.15, ఉక్రెయిన్‌కు 0.5, ఘనా 0.65, ఐవెరికోస్ట్‌ 0.55, సెయింట్‌లూసియా 0.025, సెయింట్‌ నెవీస్‌ 0.02, సెయింట్‌ విన్సెంట్‌ 0.05, సురినేమ్‌ 0.05, యాంటిగ్వా 0.04, డిఆర్‌ కాంగో 1.766, అంగోలా 0.624, జాంబియా 0.036, నైజీరియా 3.924, కంబోడియా 0.324, కెన్యా 1, లెసోతో 0.036, రువాండ 0.29, సెనెగల్‌ 0.349, గోటామిలా 0.20, కెనడా 0.50, మాలి 0.396, సుడాన్‌ 0.828, ఉగాండ 0.864, మంగోలియా 0.15మిలియన్‌ డోస్‌లను సరఫరా చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement