సెకండ్ వేవ్‌లో భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే భారత్ రకం వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 53 దేశాలకు వ్యాప్తిచెందిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) వెల్లడించింది. భారత్ రకం కేసులు 53 దేశాల్లో నమోదవుతున్నట్లు గుర్తించినట్లు WHO అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా బీ.1.617 రకం వైరస్ కేసులు మరో ఏడు దేశాల్లో నమోదైనట్లు అనధికార వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలిపింది. దీంతో ఈ వైరస్ మొత్తం 60 దేశాలకు విస్తరించిందని పేర్కొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement