Tuesday, November 26, 2024

పాకిస్థాన్‌ను ఓడించిన భారత్.. జూనియర్ ఆసియా కప్ లో మ‌రో చరిత్ర

జూనియర్ ఆసియా కప్‌లో భారత పురుషుల హాకీ జట్టు పాకిస్థాన్‌ను ఓడించింది. ఎనిమిదేళ్ల తర్వాత జరిగిన ఈ టోర్నీని చూసేందుకు భారత్, పాకిస్థాన్‌ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మ్యాచ్ చివరి నిమిషంలో పాకిస్థాన్ దూకుడు ప్రదర్శించింది. అయితే, భారత గోల్ కీపర్ మోహిత్ అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్ వ్యూహం విఫలమైంది. భారత్ తరఫున అంగద్ బీర్ సింగ్ 12వ నిమిషంలో గోల్ చేయగా, 19వ నిమిషంలో అరజిత్ సింగ్ హుందాల్ గోల్స్ సాధించారు. కాగా, భారత మాజీ ప్రధాన కోచ్ రోలాండ్ ఓల్ట్‌మన్స్‌ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు 37వ నిమిషంలో ఒక్క గోల్ మాత్రమే చేసింది.

అయితే.. జూనియర్ పురుషుల హాకీ ఆసియా కప్‌లో ఈ రెండు జట్లు ఇంతకు ముందు మూడుసార్లు ఫైనల్స్‌లో తలపడ్డాయి. 1996లో పాకిస్థాన్ గెలుపొందగా.. 2004లో భారత్ విజయం సాధించింది. 2004, 2005, 2015 తర్వాత భారత్ నాలుగోసారి టైటిల్‌ను గెలుచుకుంది. పాకిస్థాన్ 1987, 1992, 1996లలో ఛాంపియన్‌గా ఉంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈసారి ఈ టోర్నీ జరుగుతోంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ టోర్నమెంట్ 2021లో జ‌ర‌గ‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement